వచ్చే పదేళ్ళు జగనే సీఎం: దాడి
ఓవైపు తన చేరికతో వైఎస్సార్సీపీలో అసమ్మ్తతి భగ్గుమంటుంటే మరోవైపు దాడి వీరభద్రరావు అధినాయకత్వాన్ని వేనోళ్ళ కీర్తించే పనిలో తలమునకలై ఉన్నారు. ఆయన నేడు సాక్షి టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ ను యధాశక్తి కొనియాడే ప్రయత్నం చేశారు. వచ్చే పదేళ్ళు జగనే రాష్ట్ర ముఖ్యమంత్రి అని జోస్యం చెప్పారు. జగన్ లో స్వచ్ఛత తనను ఆకట్టుకుందని దాడి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా టీడీపీ.. కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరించిందని దాడి అన్నారు.